సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్‌పేట్, నాగోల్ కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ సూచించింది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం, నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణం పేర్కొంది.
రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్‌నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో , ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment