తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన | Rain Forecast For Several Districts In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Published Tue, Apr 6 2021 2:40 PM | Last Updated on Tue, Apr 6 2021 2:41 PM

Rain Forecast For Several Districts In Telangana - Sakshi

పశ్చిమ తెలంగాణా, నైరుతి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాలలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుండి 0.9 కిమీ వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరత్వడా వరకు ఏర్పడింది. మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ తెలంగాణ, నైరుతి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి (7, 8 తేదీల్లో) పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, వానపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి:
గోదావరి జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్ 
రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement