16 నుంచి వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి/వాకాడు/మహారాణిపేట (విశాఖ జిల్లా): బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని సోమవారానికి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 16–18వ తేదీ వరకు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాయలసీమలో ఎక్కువగా..కోస్తాంధ్రలో మోస్తరుగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు
సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూÆý‡ు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశమున్నట్లు తెలిపింది.
బుధవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గురువారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
6 మీటర్లు ముందుకు వచి్చన సముద్రం
తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం వద్ద సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం 6 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో మత్స్యకారులు తమ బోట్లు, వేట సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment