
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో పలుచోట్ల 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 43 డిగ్రీ సెల్సీయస్ మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలా బాద్‌లో 42 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది.
వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లా ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా వడగండ్ల వర్షాలు కురుస్తాయని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment