సాక్షి, హైదరాబాద్: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలద్రోణి వాయవ్య, పశ్చి మ, మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరం మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులతో...
బంగాళాఖాతంలో అల్పపీడనం తో రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయంది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయని అంచనా వేసింది. అలాగే మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఇక.. కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారి నాగరత్న వివరించారు.
ఇప్పటివరకు నమోదైన వర్షపాతం
అత్యధికం(4 జిల్లాలు): సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట్
అధికం(21 జిల్లాలు): ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం
సాధారణం(8 జిల్లాలు): మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపా లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సంగా రెడ్డి, మెదక్, సూర్యాపేట, ములుగు.
Comments
Please login to add a commentAdd a comment