
ద్రోహి ప్రభావంతో ఏపీలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. చాలా చోట్ల వర్షాలు కురిసే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. బుధ, గురువారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాదు కోస్తా రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. రేపు ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని అంచనా వేస్తోంది. గడిచిన రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో దాదాపు నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అయ్యింది. అయితే..
రాయలసీమ జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అనంతలో అత్యధికంగా 40.3.. నంద్యాలలో 40 డిగ్రీలు విశాఖలో అత్యల్పంగా 35.4°డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మరోవైపు మంగళవారం ఏపీలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 53 మండలాల్లో వడగాలులు వీచాయి. బుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.