సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది.
రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తు లో గాలులు వీస్తున్నట్టు వివరించింది. ఈ నెల 6,7 తేదీల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతు న్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి..
Comments
Please login to add a commentAdd a comment