సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక, తాజాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
Rains further traversed in entire Central, South, East TS pouring all over Nalgonda, Suryapet, Khammam, Jangaon, Yadadri, Warangal, Hnk, Siddipet
— Telangana Weatherman (@balaji25_t) September 22, 2023
Now these rains pouring over Mancherial, Peddapalli, Mulugu, Bhupalapally, Bhadradri will continue for 2hrs
Other parts - overcast https://t.co/Uq5n4pu03G
Morning widespread rains in #TS and raining in North and east Telangana states with Thunderstorms, Rains ended in Hyderabad and no rains expected upto afternoon-night. Later again rains expected pic.twitter.com/okkFiCaaJ4
— Telangana meteorologist (@SaiSaisathvik72) September 22, 2023
Comments
Please login to add a commentAdd a comment