రాయలసీమలో నేడు, రేపు వర్షాలు | Heavy to very heavy rain likely in Rayalaseema on August 16: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాయలసీమలో నేడు, రేపు వర్షాలు

Published Fri, Aug 16 2024 6:05 AM | Last Updated on Fri, Aug 16 2024 10:29 AM

Heavy to very heavy rain likely in Rayalaseema on August 16: Andhra pradesh

సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవ­ర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. 

దీని ప్రభావంతో రాయల­సీమలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలిక­పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తా­యన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement