ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. అలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు.
ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో స్థానికంగా పెట్రోల్‌పంపు వద్ద 100 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్ ఒక్కసారిగా కుప్పుకూలి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ముంబయి ఆధునిక మహానగరంగా మారుతుంది. సీఎం అన్ని హోర్డింగ్‌లపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు పాటించాలి’ అని ట్వీట్ చేశారు.
గాయపడిన వారిలో 31 మందిని రాజావాడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. హోర్డింగ్ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
14 dead.
Om Shanti 🙏🏽
60 injured
From a billboard collapse.
Unacceptable. And we’re a city trying to transform itself into a modern metropolis.
CM @mieknathshinde has ordered a probe into all hoardings.
Stringent rules must follow.pic.twitter.com/DxvsaoBm0l— anand mahindra (@anandmahindra) May 14, 2024
Comments
Please login to add a commentAdd a comment