విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది. అమ్మవారి దర్శన కోసం భక్తులు క్యూ లైన్లలో ఉండగా సమీపంలోని పచ్చిక నుంచి ఓ పాము వచ్చింది. పామును చూసిన భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పాము ప్రత్యక్షంతో దుర్గ గుడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.