
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): మహిళలు జీన్స్, షాట్స్, టీ షర్టులు, స్లీవ్‌లెస్ షర్టులు ధరించి వస్తే అమ్మవారి దర్శనం కానట్లే. పురుషులు సైతం షాట్స్, సగం ప్యాంట్‌లు ధరించి వస్తే అమ్మవారి దర్శనానికి అనుమతించరు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవస్థానంగా పేరున్న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేయడానికి దేవస్థాన ఈవో వీ కోటేశ్వరమ్మ నిర్ణయించారు. ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలుకు దేవస్థాన పాలకమండలి ఆమోదంతోపాటు వైదిక కమిటీతో చర్చలు జరిపారు.
జనవరి 1వ తేదీ నుంచి డ్రెస్ కోడ్ అమలుకు రంగం సిద్ధమైంది. లంగాజాకెట్, లంగాఓణీ, పంజాబీ డ్రెస్, చుడీదార్ ధరించిన మహిళలనే అనుమతిస్తారు. అమ్మ శారీస్ పేరిట చీరలను విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.100లకే చీర అందుబాటులోకి తీసుకువస్తున్న దేవస్థానం, చీరలు కట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రెస్ కోడ్ అమలుపై భక్తులకు అవగాహన కల్పించేలా దేవస్థాన ప్రాంగణంలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment