ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు | Vijayawada Kanaka Durga Temple Ticket Prices to Be Reduced | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు

Published Wed, May 29 2019 10:42 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిశ్చయ సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో భక్తులకు ఉచిత సేవలు అందించాలని నిర్ణయించినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. 29 లేదా 30వ తేదీలలో నిశ్చయ సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు గవర్నర్‌ నరసింహన్‌ అమ్మవారి దర్శనానికి వస్తారని తెలిపారు. దేవస్థానం ఈవో చాంబర్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సీఎంగా వైఎస్‌. జగన్‌ 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ రోజు నుంచి అమ్మవారి సన్నిధిలో సెల్‌ఫోన్‌ కౌంటర్‌లో టికెట్‌ను రద్దు చేస్తున్నామన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement