సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ చిన్నారి అదృశ్యమైంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తమ ఐదేళ్ల కూతురు నవ్యశ్రీ తప్పిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి తప్పిపోయందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నిర్లక్ష్య సమాధానం చెప్పారని వాపోయారు. వారి నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఉన్నత అధికారులు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో గాలింపు చర్యలు కొనసాగొస్తున్నారు. గుర్తుతెలియని మహిళ.. నవ్యశ్రీను తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. వీటి ఆధారంగా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఉదయం విజయవాడ దుర్గ గుడిలో అదృశ్యమయిన నవ్యశ్రీ సాయంకాలం నరసరావుపేటలో ప్రత్యక్షమైంది. చిన్నారిని రైలులో నరసరావుపేటకు తెచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారిని అక్కడి నుంచి పోలీసులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఓ అనుమానిత దంపతులను పోలీసులు విచారించగా.. పాపను పెంచుకోవడానికే తీసుకొచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment