Baby disappearance
-
దుర్గగుడిలో చిన్నారి అదృశ్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ చిన్నారి అదృశ్యమైంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తమ ఐదేళ్ల కూతురు నవ్యశ్రీ తప్పిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి తప్పిపోయందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని నిర్లక్ష్య సమాధానం చెప్పారని వాపోయారు. వారి నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఉన్నత అధికారులు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గాలింపు చర్యలు కొనసాగొస్తున్నారు. గుర్తుతెలియని మహిళ.. నవ్యశ్రీను తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. వీటి ఆధారంగా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఉదయం విజయవాడ దుర్గ గుడిలో అదృశ్యమయిన నవ్యశ్రీ సాయంకాలం నరసరావుపేటలో ప్రత్యక్షమైంది. చిన్నారిని రైలులో నరసరావుపేటకు తెచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారిని అక్కడి నుంచి పోలీసులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఓ అనుమానిత దంపతులను పోలీసులు విచారించగా.. పాపను పెంచుకోవడానికే తీసుకొచ్చామని తెలిపారు. -
విజయవాడ దుర్గా గుడిలో చిన్నారి అదృశ్యం
-
పసికందు మాయం..
లంగర్‌హౌస్: పట్టపగలు తల్లితో కలిసి నిద్రిస్తున్న రెండు నెలల పసికందు అపహరణకు గురైన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన కవిత నగరానికి వచ్చి కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇలా పరిచమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా నెలరోజుల క్రితం భర్త మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కుమారుడితో కలిసి రాంలీలా మైదానంలోని చింతచెట్టు కింద నిద్రిస్తున్న ఆమె మెలుకువ వచ్చి చూసే సరికి బాబు కనిపించలేడు. దీంతో లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నిఘా నిల్ !
బందరు జిల్లా ఆస్పత్రిలో భద్రత ప్రశ్నార్థకం గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఎక్కడా కానరాని సీసీ కెమెరాలు విజయవాడలో శిశువు అదృశ్యంపై సర్వత్రా ఆందోళన మచిలీపట్నం టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు నూజివీడు, గుడివాడ ఏరియా ఆస్పత్రుల్లోనూ నిఘా కొరవడింది. ఈ క్రమంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తరచూ పిల్లల అపహరణ వార్తలు తల్లిదండ్రులను ఆందళోనకు గురిచేస్తున్నాయి. అయినా సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రులు కిటకిట.. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటాయి. ప్రసూతి విభాగాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఐదు రోజుల శిశువు అపహరణకు గురైన విషయం తెలియడంతో ఇక్కడి ఆస్పత్రుల్లోని ప్రసూతి వార్డుల్లో ఉన్న బాలింతలు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి శిశువుల వద్ద షిఫ్టుల వారీగా కాపలా ఉంటున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానంగా చూస్తూ భయపడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 30మంది, సిజేరియన్ ప్రసూతి వార్డులో 30మంది బాలింతలు, శిశువులు ఉంటున్నారు. ఆయా వార్డులతోపాటు మరో 20 పడకలతో ఉన్న నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్సీఎన్ఎన్యూ) వద్ద కూడా భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.