
సాక్షి, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ఆశీర్వచన మండపంలో బొమ్మల కొలువు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల సందడి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment