
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది. అమ్మవారి దర్శన కోసం భక్తులు క్యూ లైన్లలో ఉండగా సమీపంలోని పచ్చిక నుంచి ఓ పాము వచ్చింది. పామును చూసిన భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పాము ప్రత్యక్షంతో దుర్గ గుడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment