క్యూలైన్‌లో వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు
ఇంద్రీకలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి అధికారుల తీరుపై మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. దసరా మహోత్సవాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా దర్శించుకునేందుకు కృష్ణంరాజు ఆదివారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి విచ్చేసిన కృష్ణంరాజు కుటుంబం కుంకుమార్చనలో పాల్గొనాలని పోలీసు సిబ్బందిని అడిగింది. అయితే సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కృష్ణంరాజు, అతని కుటుంబం ఈవో కార్యాలయం పక్కనే ఉన్న క్యూలైన్‌లో నుంచి కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.
క్యూలైన్‌లో వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు దంపతులు
సాధారణ భక్తులతో పాటు అష్టకష్టాలు పడుతూ మెట్లు దిగి ఆరో అంతస్తుకు చేరుకున్నారు. మార్గంలో పలుచోట్ల కృష్ణంరాజు ఆయాస పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం నడవలేనని చెప్పినా ఆలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడైన కృష్ణంరాజును పట్టించుకోకపోవడం సరికాదని పలువురు భక్తులు పేర్కొన్నారు. అనంతరం విశేష కుంకుమార్చనలో పాల్గొన్న కృష్ణంరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుంది. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment