
సాక్షి, విజయవాడ : బుధవారం నుంచి కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న మూలానక్షత్రం నాడు సరస్వతీదేవి అవతారంలో కనకదుర్గమ్మను అలంకరించనున్నారు. ప్రతియేటా మూడు లక్షల మంది భక్తులు మూలానక్షత్రం నాడు అమ్మవారిని దర్శించుకుంటారు . ఈ ఉత్సవాల్లో భక్తులు ఇచ్చిన ఆభరణాలతో నిత్యం అమ్మవారికి అలంకారాలు చేయనున్నట్లు తెలిపారు. రూ.8.30 కోట్లతో అమ్మవారి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ను కల్పించారు. ఉత్సవాల తొలి రోజు కాణిపాకం వినాయక ఆలయం నుంచి అమ్మ వారికి పట్టువస్త్రాలు రానున్నాయి. ఈనెల 18తో ఉత్సవాల ముగుస్తాయని దుర్గ గుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment