శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న మ్యూజియా నికి హైదరాబాద్ వాసులు 50 పంచలోహ విగ్రహాలను ఆలయ ఈవో సూర్యకుమారికి ఆదివారం అందచేశారు.
విరాళంగా అందచేసిన హైదరాబాద్ వాసులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న మ్యూజియా నికి హైదరాబాద్ వాసులు 50 పంచలోహ విగ్రహాలను ఆలయ ఈవో సూర్యకుమారికి ఆదివారం అందచేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలు పంచలోహ విగ్రహాలను ఈవో సూర్యకుమారికి అందచేశారు.
హైదరాబాద్‌కు చెందిన అడవికొలను శేషగిరిరావు ఫ్యామిలీ ఫౌండేషన్ వారు సేకరించిన అతి పురాతనమైన విగ్రహాలు, శాసనాలు, వర్ణచిత్రాలు, నాణేలు, అమ్మవారు, స్వామి వారితో పాటు పరివారానికి చెందిన విగ్రహాలను దేవస్థానానికి అందజేశారు.