సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) :‘బెజవాడ దుర్గమ్మ అలయంలో నిబంధనలకు విరుద్ధంగా 2017, డిసెంబర్ 26 అర్ధరాత్రి ‘ఏవో’ పూజలు చేశారు. అమ్మవారి గుడిలో అనుసరిస్తున్న స్మార్థ వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఈ తంతు జరిగింది. ఆలయంతో సంబంధంలేని బయట వ్యక్తులు అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించారు’ అని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.
‘భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ ఉదంతంలో అన్ని వాస్తవాలూ వెలుగు లోకి రావాలంటే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి’ అని కూడా సూచించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయంలో నిబం ధనలకు విరుద్ధంగా తాంత్రిక పూజలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు ఆలయంలోకి అర్ధరాత్రి దాటాక వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దాంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రస్తుతానికి కీలక సమాచారాన్ని రాబట్టి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
విడిచిపెట్టారు.. కానీ నిఘా పెట్టారు: అర్చకుడు సృజన్‌ను పోలీసులు గురువారం విడిచిపెట్టారు. అమ్మవారికి డిసెంబర్ 26 అర్ధరాత్రి అలంకరణ చేసింది అతనే. మంత్రి లోకేష్‌కు రాజయోగం కోసమే తాంత్రిక పూజలు నిర్వహించినట్లు సృజన్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో అతణ్ని అదుపులోకి తీసుకున్నా విషయాన్ని పోలీసులు నిర్ధారిం చలేదు. దీనిపై అతని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దాంతో సృజన్‌ను గురువారం ఉదయం అతని స్వస్థలం పెద్దపులివేరులో విడిచిపె ట్టారు. సృజన్ ఎవరితో మాట్లాడకుండా హెచ్చరించి అతనిపై నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment