ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీ మహాంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బోనాలను సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలోని జమ్మిచెట్టు వద్ద అమ్మవారికి, బోనాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, బోనాల కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. బోనాలకు ఈవో సాదరంగా స్వాగతం పలికారు. బోనాలను సమర్పించేందుకు హైదరాబాద్ నుంచి విచ్చేసిన సుమారు వెయ్యి మంది కళాకారులు, బోనాల కమిటీ సభ్యులు నిర్వహించిన ఊరేగింపు ఎంతో అకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment