mahankali bonalu
-
కష్టం లేకపోతే సోమరులవుతారు.. భవిష్యవాణిలో స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బోనాల సందర్బంగా నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని తెలిపింది.భవిష్యవాణిలో స్వర్ణలత కామెంట్స్ ఇవే..భక్తుల అందరి పూజలు సంతోషంగా పూజలు అందుకున్నాను.భక్తులకు ఎవరికి ఆటంకాలు లేకుండా చూసుకున్నాను.ఏ బోనం అయిన సంతోషంతో ఆనందంగా అందుకుంటానునా సన్నిధికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆశీర్వదిస్తాను.కోరిన వరాలు ఇస్తాను.పాడి పంటలు సంవృద్ధిగా ఉంటాయి.కష్టం లేకపోతే సోమరి పోతులుగా తయారువతారు.నా వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టపడాలి కదా.ఎటువంటి ఆపద, వ్యాధులు రాకుండా చూసుకునే భాధ్యత నాదిఎవరు అడ్డుపడిన, రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను.ఐదు వారాలు పప్పు బెల్లం శాకాలు పెట్టాలి.ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.కోరినన్ని వర్షాలు ఉన్నాయి.ఔషధాలు తగ్గించుకొని.. పాడి పంటలు సమృద్ధిగా చేసుకుంటే వ్యాధులు ఉండవు.బలి కార్యక్రమం మీకు తోచినట్టు చేస్తున్నారు సంతోషిస్తున్నాను.బాలింతలకు, గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దర్శించుకున్న భక్తుల్ని ఇబ్బందులు రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. -
హస్తినలో ‘బంగారు బోనం’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బుధవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బంగారు బోనాన్ని ఎత్తుకుని సింహవాహిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడు ఒక్కడేనని.. భిన్న రూపాల్లో మనం దేవుడిని కొలుస్తామని అన్నారు. ఇదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో ఈ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుందని గవర్నర్ రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేంద్రయాదవ్, ఇతర ముఖ్యులు గవర్నర్‌కు జ్ఞాపికను అందించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కర్తవ్యపథ్ నుంచి తెలంగాణభవన్ వరకు నిర్వహించిన అమ్మవారి ఘట ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు డోలు, డప్పు దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
వైభవంగా లాల్ దర్వాజ బోనాలు (ఫోటోలు)
-
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందడి (ఫొటోలు)
-
అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు.కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కాగా ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ►ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ►కాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు, రేపు ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. -
పెద్దమ్మ తల్లికి నేడు బంగారు బోనం
చార్మినార్: భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11–30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్‌గౌడ్ తెలిపారు. ఈసారి జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామన్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు. ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారికి బంగారు పాత్రలో బోనానంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించామన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉప్పుగూడ మహాంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనాన్ని తీసుకెళ్లి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు సమర్పించనున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిçస్తూ పరిమిత సంఖ్యలో దేవాలయానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. -
బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలనుకేటాయించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ♦ ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, అదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ మధ్య ఉన్న సుభాస్ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు. ♦ కర్బలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా ..ఎస్బీహెచ్ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు.. ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట్ వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివే.. ♦ సెయింట్ జాన్స్ రోటరీ, ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీ ♦ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ ♦ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ ♦ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం ♦ మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్ మద్యం విక్రయాలపై కూడా.. ఉజ్జయినీ బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట్, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇది అమల్లో ఉంటుంది. స్టార్ హోటల్స్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. -
బెజవాడ దుర్గమ్మకు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీ మహాంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బోనాలను సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలోని జమ్మిచెట్టు వద్ద అమ్మవారికి, బోనాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, బోనాల కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. బోనాలకు ఈవో సాదరంగా స్వాగతం పలికారు. బోనాలను సమర్పించేందుకు హైదరాబాద్ నుంచి విచ్చేసిన సుమారు వెయ్యి మంది కళాకారులు, బోనాల కమిటీ సభ్యులు నిర్వహించిన ఊరేగింపు ఎంతో అకట్టుకుంది. -
జనసంద్రమైంన గోల్కొండ కోట
-
జులై 15 నుంచి బోనాల ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నెల రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జులై 15వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం మంత్రులు తలసాని, పద్మారావు సమీక్ష నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జులై 29వ తేదిన మహంకాళి అమ్మవారి బోనాలు, 30న రంగం జరగనుంది. రూ. కోటి వ్యయంతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయిస్తామని తలసాని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. -
గోపాలపురం ఏసీపీపై వేటు
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 9న మహంకాళి అమ్మవారి దర్శనానికి దత్తాత్రేయ కుటుంబసమేతంగా వచ్చారు. అయితే దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏసీపీ శ్రీనివాసరావు ఆలయానికి కొద్దిదూరం ముందే నిలిపివేశారు. తన సతీమణి అనారోగ్యం కారణంగా నడవలేదని దత్తాత్రేయ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక కేంద్రమంత్రి వాహనం దిగి నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో హైదరాబాద్ పోలీసు కమిషన్ మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. -
జూలై 9న మహంకాళి బోనాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కళాజాతర
-
‘నాకు రక్త తర్పణం చేయటం లేదు’
హైదరాబాద్: ‘మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు.. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను నిలదీసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యవాణిని స్వర్ణలత వినిపించింది.‘ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం ఘనంగా నిర్వహించటం సంతోషకరం. కోరినన్ని వానలు కురిపిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి.. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.. నేనేమీ వెజిటేరియన్‌ను కాదు కదా..’ అని స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. భవిష్య వాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమం నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించడంతో.. అప్రమత్తమైన పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బోనాలలో పోలీసుల ఓవర్ యాక్షన్
-
వైభవంగామహంకాళి బోనాలు
-
ప్రత్యేక పూజలు చేసిన సబితారెడ్డి
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్ గ్రామంలో ఆదివారం బోనాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహంకాళీ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన అతి పూరాతన ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన, పుష్పాలంకరణ, అభిషేకం చేసి పసుపు, గంధంతో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో సుమారు 200 బోనాలు.. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో, యువకుల డ్యాన్సులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, సర్పంచ్ అత్తెని కౌసల్యబాబు యాదవ్, ఎంపీటీసీ మదన్మోహన్, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, కాంగ్రెస్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పహడీషరీఫ్ సీఐ చలపతి, ఎస్ఐ మహేందర్‌జీ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బ్రహ్మంచారి, చిప్ప సురేష్, యాదయ్య, శ్రీకాంత్, రవి నాయక్, నాసర్‌ఖాన్, సామెల్‌రాజ్, నర్సింగ్‌రాజ్, విలాస్, శ్రీనివాస్ నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పూజలు మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, మంఖాల్ గ్రామ సర్పంచ్ కౌసల్య, ఉప సర్పంచ్ సుందరయ్య, నాయకులు కొమిరెడ్డి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ పాండు నాయక్, మహేందర్ యాదవ్, నల్ల వీరేష్‌గౌడ్, మంత్రి రాజేష్, కాకి ఈశ్వర్ ముదిరాజ్, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.