జూలై 9న మహంకాళి బోనాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను వచ్చే నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.