సాక్షి, విజయవాడ: చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న వెలంపల్లి.. పవన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే. చిరంజీవికి అధికారం రాలేదని.. ఆయన్ని పక్కకి పెట్టింది పవనే. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయని అసలు పార్టీలో కనపడకుండా పోయాడు. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్ ఎందుకు చెప్పలేకపోయాడు?. అసలు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్. మేం పిలుస్తున్నా పవనే రావడం లేదని స్వయంగా నాగబాబు.. మెగా అభిమానుల మధ్య చెప్పాడు..
చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.
ఇక ఎలాంటి తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్న ప్రభుత్వం తమదని.. పథక లబ్ధి అందుకుంటున్న వాళ్లలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎంపీగా ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఎం.ఎల్.సి. రూహుల్లాహ్,కార్పొరేటర్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీతో పవన్‌లో ఫ్రస్ట్రేషన్
Comments
Please login to add a commentAdd a comment