సాక్షి, తిరుపతి: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం తిరుపతి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్యజ్యోతి ప్రచురించిన అసత్య కథనాలపై టీటీడీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికపై సుబ్రహ్మణ్యస్వామి వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు.
కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసింది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదని తెలిపారు. కేసులో వాదనలు వినిపించేందుకు హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చానని చెప్పారు.
న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందన్నారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఆంధ్రజ్యోతి అసత్య వార్తను ప్రచురించారని విమర్శించారు. దీనికి సంబంధించి దేవస్థానం అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించిందని తెలిపారు.
చదవండి: TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
Comments
Please login to add a commentAdd a comment