
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ కేసును పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
కథనాన్ని ప్రచురించే ముందు టీటీడీ అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే తాను ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment