
‘గుజరాత్ అల్లుడ్ని కాదా? రాష్ట్రపతిగా ఆమె బెస్ట్’
ఈ మధ్య ఆకట్టుకునేలా ట్వీట్లు చేస్తూ కాస్తంత వివాదాలను కూడా మూటగట్టుకుంటున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఈ మధ్య ఆకట్టుకునేలా ట్వీట్లు చేస్తూ కాస్తంత వివాదాలను కూడా మూటగట్టుకుంటున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ జరగగా తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్నందున మరోసారి ఆ ఎన్నికల చుట్టూ ఆసక్తికరమైన ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం గుజరాత్ అల్లుడిని కాదా అంటూ ఓ ట్వీట్ ట్వీటారు. అంతకుముందే శివసేన పార్టీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రెసిడెంట్ రేసులో లేనందున తాము ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు రాష్ట్రపతిగా మద్దతిస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జేడీయూ నితీశ్ కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా తగినవారంటూ పేర్కొంది.
One of the best candidate for President is fmr Gujarat CM Anandibehn Patel. So what if she is Gujarati? I too am Gujarat's son in law.
— Subramanian Swamy (@Swamy39) 25 April 2017