
వావ్! 420.. రజినీపై స్వామి సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: దక్షిణాది ప్రముఖ స్టార్, త్వరలో తమిళ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టనున్నారంటూ విస్తృత ప్రచారంలో ఉన్న రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబు పేల్చారు. రజినీకాంత్ అమెరికాలో క్యాసినోలో దూరి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని, ఆయనపై వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించాలంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రజినీ గ్యాంబ్లింగ్ ఆటను వీక్షిస్తున్న రజినీ ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.
‘ఆర్‌కే 420’ అంటూ ఆయన పరుష పదజాలాన్ని పరోక్షంగా రజినీకాంత్‌ను ఉద్దేశించి ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘వావ్! ఆర్‌కే 420 తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అమెరికాలోని క్యాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఆయనకు అన్ని డాలర్లు ఎక్కడ నుంచి వచ్చాయో ఈడీ తప్పనిసరిగా కనుక్కోవాల్సిందే’ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Wow! RK 420 in a US Casino gambling to improve his health!! ED must find out from where his $$ came from. pic.twitter.com/4UeUgg9yNN
— Subramanian Swamy (@Swamy39) 5 July 2017