
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ సినీ నటుడు రజనీకాంత్‌కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్, హీరో విశాల్ సైతం రజనీకాంత్‌కు మద్దతు పలకడంతో పాటు అన్ని స్థానాల్లో సూపర్ స్టార్ తరఫున ప్రచారం చేస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ పై తన అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా లారెన్స్ మరోసారి చాటుకున్నారు. రజనీతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్. ఇక్కడ నేను పోస్ట్ చేసిన ఫొటో నాకు 12ఏళ్లు ఉన్నప్పుడు ‘తలైవా’ రజనీకాంత్‌ను కలుసుకున్న సందర్భంగా దిగాను. చిన్నప్పటినుంచీ తలైవా అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉంది. 12 ఏళ్లప్పుడే తలైవా ఫ్యాన్స్ క్లబ్‌లో చేరాను. జీవితాంతం నేను తలైవాకు అభిమానినే’ అంటూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు లారెన్స్. పిల్లల శరణాలయం, వృద్ధాశ్రమం, వైద్య, విద్యా సాయాలంటూ పలు సామాజిక సేవలు అందిస్తోన్న లారెన్స్.. ఇటీవల రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించగానే మద్ధతు తెలిపారు. రేపు (జనవరి 9న) తన జన్మదినం సందర్భంగా లారెన్స్ తాను ఎప్పటికీ తలైవా అభిమానినేనంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఇటీవల లారెన్స్ మాట్లాడుతూ.. ఎవరైనా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటారని, రజనీకాంత్ అదే చేస్తారని.. తాను తలైవాకు రక్షకుడిగా ఉంటానంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Hi dear Friends and Fans..! This picture was taken when I was 12 year old in Thalaivar Fans club. The care and love I had for him from my childhood has never changed and will never change as a Thalaivar ‘s Fan. pic.twitter.com/2QkCNxgM85
— Raghava Lawrence (@offl_Lawrence) 7 January 2018
Comments
Please login to add a commentAdd a comment