రజనీ రక్షకుడవుతున్న శిష్యుడు | Raghava Lawrence on Superstar Rajinikanth's political entry | Sakshi
Sakshi News home page

రజనీ రక్షకుడవుతున్న శిష్యుడు

Published Wed, Jan 3 2018 8:32 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

Raghava Lawrence on Superstar Rajinikanth's political entry - Sakshi

తమిళసినిమా: సినీరంగంలో సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ శిష్యుడు రాజకీయాల్లో రక్షకుడిగా మారబోతున్నారా? ఆయన మాటల్లో అలాంటి అర్థమే స్పష్టమవుతోంది. నటుడు రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గత ఆదివారం అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ హెడ్‌లైన్స్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రకంపనలు ఇంకా సద్దుమణగక ముందే నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. పిల్లల శరణాలయం, వృద్ధాశ్రమం, వైద్య, విద్యా సాయాలంటూ పలు సామాజిక సేవలను అందిస్తున్న లారెన్స్‌ రాజకీయాల గురించి తరచూ తనదైన బాణీలో స్పందిస్తున్నారు. నిజానికి జల్లికట్టు పోరాటం సమయంలోనే అవసరం అయితే రాజకీయరంగ ప్రవేశం చేయడానికి వెనుకాడను అంటూ ప్రకటన చేసి అది దుమారం రేపడంతో మాట మార్చిన లారెన్స్‌ నటుడు రజనీకాంత్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.

రజనీని గురువుగా భావించే ఈయన కూడా రాఘవేంద్రస్వామి భక్తుడే అన్నది గమనార్హం. రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రకటించిన రజనీకాంత్‌ తనకిప్పుడు కావలసింది కార్యకర్తలు కాదని, సేవకులని పేర్కొన్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు లారెన్స్‌ బదులిస్తూ ఎవరైనా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటారని, రజనీకాంత్‌ అదే చేస్తారని వ్యాఖ్యానించారు. ‘మీ రాజకీయరంగప్రవేశం ఎప్పుడన్న’ ప్రశ్నకు తానెప్పు డో రంగప్రవేశం చేశానని బదులిచ్చారు. ‘మీరు గురువుగా భావించే రజ నీ కాంత్‌కు రాజకీయ సేవకుడిగా మారతారా’ అన్న ప్రశ్నకు ఈ నెల 4వ తేదీన ఇలాంటి పలు విషయాల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెబుతానని లారెన్స్‌ చెప్పారు. దీంతో మరో నటుడు రాజకీయరంగప్రవేశానికి రెడీ అవుతున్నారనే ప్రచారం వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement