
సాక్షి, చెన్నై: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్ స్పందించారు. రాజకీయాల్లోకి రజనీ రాకను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ‘తలైవా’కు అభినందనలు తెలిపారు. తన సోదరుడి సామాజిక చైతన్యాన్ని ప్రశంసించారు.
తలైవాకు తిరుగులేదు..
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. రాజకీయ వ్యవస్థను రజనీకాంత్ ప్రక్షాళన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని సీనియర్ నటుడు కబీర్ బేడి ట్వీట్ చేశారు. రాజకీయాల్లో రజనీకాంత్ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
తమిళనాడు ప్రజలు రజనీకాంత్ వెంటే ఉంటారని, ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగుస్వామి ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రజలు 20 ఏళ్లుగా మీ కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పడు వారి కల ఫలించింద’ని నటుడు శివకార్తికేయన్ ట్వీట్ చేశారు. బీజేపీ తమిళనాడు విభాగం ట్విటర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
‘తమిళ సినీపరిశ్రమలో రజనీకాంత్ సూపర్‌స్టార్ అనడటంలో ఎటువంటి సందేహం లేదు. దేశ రాజకీయాల్లో మాత్రం తిరుగులేని సూపర్‌స్టార్ నరేంద్ర మోదీ ఒక్కరే. ఈ విషయం తలైవాకు బాగా తెలుసున’ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment