
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి.. తాజాగా అయోధ్యం అంశంపై అటువంటి మాటలే అన్నారు. మంగళవారం రామజన్మభూమి-మసీదు అంశంపై సుప్రీకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుబ్రమణ్య స్వామికి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు తీర్పుల ఏలా వచ్చినా.. వచ్చే ఏడాది దిపావళి వేడుకలు మాత్రం ఆయోధ్యలో జరుగాతయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి రామజన్మభూమిలో అయోధ ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఆలయాన్ని ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతంగా పిలవబడుతున్న చోట.. ప్రార్థనలు చేసుకోవడం హిందువుల హక్కు అని ఆయన చెప్పారు. రామజన్మభూమి ప్రాంతంపై ముస్లింలకు హక్కు లేదని.. కేవలం ఆస్తి కోసమే దావాలు వేశారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment