
గత రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యుక్షుడు రాహుల్ గాంధీని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాంటూ ఓ నటి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంకేముంది రాహుల్‌పై సెటైర్లు గుప్పించడంలో ముందుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్‌లో స్పందించారు.
'గత రాత్రి మంచి వాక్చాతుర్యం ఉన్న రాహుల్‌గాంధీతో ఉన్నా. రాహుల్ గాంధీ ఓ జ్ఞాని' అంటూ సెప్టెంబర్ 14న నతాలియా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. రాహుల్ గాంధీ ఏదో లెక్చర్ టూర్‌లో ఉన్నప్పుడు తనతోనే ఉన్నాడంటూ నతాలియా ట్వీట్ చేశారని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్‌ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గత రాత్రి బుద్ధూను కలుసుకున్నానని ఆమె ట్వీట్ చేసింది కదా? నతాలియా రామోస్ ఎవరు? అంటూ సెటైర్లు విసిరారు.
అమెరికాలో రెండు వారాల పర్యటనలో భాగంగా నతాలియా రామోస్‌ను రాహుల్ గాంధీ కలిశారు. యూఎస్‌లో జరిగిన సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరయిన పలువురు ప్రముఖుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త పునీత్ అహుల్వాలియాను కలిశారు. వర్జీనియా గవర్నర్ టెర్రీ మెకాలిఫ్‌ను కూడా రాహుల్ కలిసినట్టు సమాచారం. అయితే రాహుల్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో నతాలియాతో కలిసి తీసుకున్న ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఇంతకీ నతాలియా ఎవరంటే ?
అస్ట్రేలియన్-స్పానిష్ నటి నతాలియా నోరా రామోస్ కొహెన్ 1992లో జన్మించారు. అమెకి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ది డిమోండ్, బ్రాట్జ్ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నిక్‌లోడెన్ టెలివిజన్ సిరీస్‌లోని హౌస్ ఆఫ్ అనుబిస్‌లో నినా మార్టిన్‌గా ప్రధాన పాత్రలో నటించారు. నతాలియా తల్లి ఆస్ట్రేలియన్ కాగా, తండ్రి స్పానిష్ పాప్ సింగర్ జువాన్ కార్లోస్.
Who is Nathalia Ramos? She tweets that she was with Buddhu "last night". Some lecture tour! pic.twitter.com/RpR816X8ZV
— Subramanian Swamy (@Swamy39) September 22, 2017