స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు | Nizamuddin clerics who disappeared in Pakistan are working against India: Subramanian Swamy | Sakshi
Sakshi News home page

స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు

Published Mon, Mar 20 2017 6:17 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు

స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్థాన్‌లో కనిపించకుండా పోయి తిరిగి భారతదేశంలోకి సురక్షితంగా వచ్చిన ముస్లిం మత పెద్దలపై స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు అబద్ధం చెబుతున్నారని అన్నారు. వారు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వారిని వారు రక్షించుకునేందుకు సానుభూతి పొందేందుకు అబద్ధం చెబుతున్నారు. రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఏజెంట్లుగా తమను తాము వర్ణించుకుంటున్నారు. వారిని నమ్మలేం. వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మా వద్ద పక్కా సమాచారం ఉంది’ అని స్వామి అన్నారు.

పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు హజ్రత్‌ నిజాముద్దీన్‌, సయ్యద్‌ ఆసిఫ్‌ నిజామీ సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కనిపించకుండా వెళ్లిన వారు కనిపించకుండా పోవడంతో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్‌లోని  ఉమ్మత్‌ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్‌ నిజామీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement