Hazrat Nizamuddin
-
వీడియో: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే టికెట్ కౌంటర్లో ఘరానా మోసం!
ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా లేకపోతే ప్రతీ చోట మోసపోక తప్పదు. డబ్బులు, వస్తువులను సెకన్ల వ్యవధిలో మాయం చేసే కేటుగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే, రైల్వేస్టేషన్‌లోని టికెట్ కౌంటర్లో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఓ ప్రయాణికుడికే షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు అతడిపై చర్యలకు దిగారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని హజ్రత్ నిజామోద్దీన్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుడు టికెట్ కోసం క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో కౌంటర్లో ఉన్న ఉద్యోగికి రూ.500 నోటు ఇచ్చి గ్వాలియర్‌కు(రూ.125 ధర) టికెట్ ఇవ్వమన్నాడు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. అదేదో మ్యాజిక్ తనకే వచ్చు అన్నట్టుగా కౌంటర్ నుంచి రూ. 20 నోటు తీసి రూ. 500 నోటును సెకన్లలో దాచేశాడు. అనంతరం.. తనకు 20 రూపాయలే ఇచ్చావని.. ఇంకా డబ్బులు ఇవ్వాలని బుకాయించారు. దీంతో, సదరు ప్రయాణికుడు షాకై.. ఉద్యోగిని నిలదీశాడు. అప్పటికే సదరు ఉద్యోగి తనకు రూ.20 మాత్రమే ఇచ్చాడని ఓవరాక్షన్ చేశాడు. అయితే, ఇదంతా పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడం ఉద్యోగి అసలు బండారం బయటకు వచ్చింది. దీంతో, ప్లాన్ రివీల్ కావడంతో ఉద్యోగి నాలుకు కరుచుకున్నాడు. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు షేర్ చేశాడు. ఈ క్రమంలో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు. #Nizamuddin station booking office Date 22.11.22 Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf — RAILWHISPERS (@Railwhispers) November 24, 2022 The employee has been taken up and disciplinary proceedings have been initiated against him. — DRM Delhi NR (@drm_dli) November 25, 2022 -
స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్థాన్‌లో కనిపించకుండా పోయి తిరిగి భారతదేశంలోకి సురక్షితంగా వచ్చిన ముస్లిం మత పెద్దలపై స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు అబద్ధం చెబుతున్నారని అన్నారు. వారు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వారిని వారు రక్షించుకునేందుకు సానుభూతి పొందేందుకు అబద్ధం చెబుతున్నారు. రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) ఏజెంట్లుగా తమను తాము వర్ణించుకుంటున్నారు. వారిని నమ్మలేం. వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మా వద్ద పక్కా సమాచారం ఉంది’ అని స్వామి అన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు హజ్రత్ నిజాముద్దీన్, సయ్యద్ ఆసిఫ్ నిజామీ సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కనిపించకుండా వెళ్లిన వారు కనిపించకుండా పోవడంతో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్‌లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు. -
మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారు సాయంత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలువనున్నారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండాపోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. పాక్‌లో వారు సురక్షితంగా ఉన్నారని, సోమవారం తిరిగి రానున్నారని వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు.