ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా లేకపోతే ప్రతీ చోట మోసపోక తప్పదు. డబ్బులు, వస్తువులను సెకన్ల వ్యవధిలో మాయం చేసే కేటుగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే, రైల్వేస్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌లో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఓ ప్రయాణికుడికే షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు అతడిపై చర్యలకు దిగారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీలోని హజ్రత్ నిజామోద్దీన్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడు టికెట్ కోసం క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో కౌంటర్‌లో ఉన్న ఉద్యోగికి రూ.500 నోటు ఇచ్చి గ్వాలియర్‌కు(రూ.125 ధర) టికెట్ ఇవ్వమన్నాడు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. అదేదో మ్యాజిక్ తనకే వచ్చు అన్నట్టుగా కౌంటర్ నుంచి రూ. 20 నోటు తీసి రూ. 500 నోటును సెకన్లలో దాచేశాడు. అనంతరం.. తనకు 20 రూపాయలే ఇచ్చావని.. ఇంకా డబ్బులు ఇవ్వాలని బుకాయించారు. దీంతో, సదరు ప్రయాణికుడు షాకై.. ఉద్యోగిని నిలదీశాడు.
అప్పటికే సదరు ఉద్యోగి తనకు రూ.20 మాత్రమే ఇచ్చాడని ఓవరాక్షన్ చేశాడు. అయితే, ఇదంతా పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడం ఉద్యోగి అసలు బండారం బయటకు వచ్చింది. దీంతో, ప్లాన్ రివీల్ కావడంతో ఉద్యోగి నాలుకు కరుచుకున్నాడు. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు షేర్ చేశాడు. ఈ క్రమంలో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు.
#Nizamuddin station booking office
— RAILWHISPERS (@Railwhispers) November 24, 2022
Date 22.11.22
Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf
The employee has been taken up and disciplinary proceedings have been initiated against him.
— DRM Delhi NR (@drm_dli) November 25, 2022
Comments
Please login to add a commentAdd a comment