Syed Nazim Ali nijami
-
స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్థాన్‌లో కనిపించకుండా పోయి తిరిగి భారతదేశంలోకి సురక్షితంగా వచ్చిన ముస్లిం మత పెద్దలపై స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు అబద్ధం చెబుతున్నారని అన్నారు. వారు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వారిని వారు రక్షించుకునేందుకు సానుభూతి పొందేందుకు అబద్ధం చెబుతున్నారు. రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) ఏజెంట్లుగా తమను తాము వర్ణించుకుంటున్నారు. వారిని నమ్మలేం. వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మా వద్ద పక్కా సమాచారం ఉంది’ అని స్వామి అన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు హజ్రత్ నిజాముద్దీన్, సయ్యద్ ఆసిఫ్ నిజామీ సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కనిపించకుండా వెళ్లిన వారు కనిపించకుండా పోవడంతో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్‌లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు. -
మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారు సాయంత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలువనున్నారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండాపోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. పాక్‌లో వారు సురక్షితంగా ఉన్నారని, సోమవారం తిరిగి రానున్నారని వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు. -
పాక్‌లో అదృశ్యమైన మత గురువులు క్షేమమే
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ: పాకిస్తాన్లో అదృశ్యమైన మతగురువులిద్దరూ క్షేమంగానే ఉన్నారని, వారు సోమవారం ఢిల్లీకి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న ఇక్కడ్నుంచి బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాకిస్తాన్ శనివారం వెల్లడించింది. దీనిపై సుష్మాస్వరాజ్ ఆదివారం ట్వీట్ చేశారు. సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో మాట్లాడానని, క్షేమంగానే ఉన్నామని ఆయన చెప్పినట్లు తెలిపారు.