సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ మంత్రులు విదేశీ దుస్తులు ధరించకుండా నిషేధం విధించాలి. అంతేకాకుండా బీజేపీ మంత్రులు మద్యం కూడా ముట్టుకోకూడదు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ చర్యలను అమలుచేయాలని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. బీజేపీ మంత్రులు భారతీయ వాతావరణానికి అనుకూలంగా దుస్తులు వేసుకోవాలని హితవు పలికారు. పాశ్చాత్య సంస్కృతి దుస్తులు ధరించడమంటే విదేశీ బానిసత్వానికి లొంగిపోవడమేనని విమర్శించారు.
'పాశ్చాత్య దుస్తులంటే విదేశీ బానిసత్వాన్ని అంగీకరించడమే. మంత్రులు భారతీయ వాతావరణానికి అనుకూలమైన దుస్తులు వేసుకునేలా బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 మద్యపానాన్ని నిషేధించాలని సూచిస్తోంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవడం లేదు కానీ బీజేపీ తన క్రమశిక్షణలో దీనిని కూడా భాగం చేసుకోవాలి' అని సుబ్రహ్మణ్యస్వామి వరుసగా ట్వీట్ చేశారు.
పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరిగిన పండిట్ మదన్ మోహన్ మాల్వియా జయంతి ఉత్సవాల్లో ఎన్డీయే మంత్రులు పాల్గొనలేదని సుబ్రహ్మణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మంత్రులు వెస్ట్రన్ దుస్తులు ధరించకూడదంటూ స్వామి ఈ మేరకు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment