
సాక్షి,న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం అత్యవసర వినియోగానికి కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు..ఈ నేపథ్యంలో భారతీయులంతా ప్రయోగాలకు ఉపయోగించుకునే గినియా పిగ్స్‌లా మారి పోనున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. (తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి)
దీంతో ట్విటర్‌లో దుమారం రేగింది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తల సామర్ధ్యాన్నే తప్పుబడుతున్నారా అని కొంతమంది ప్రశ్నించారు. అలాగే మహమ్మారి గురించి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి డబ్ల్యూహెచ్‌ఓ మొత్తం ప్రపంచాన్నే మోసం చేసింది. అలాంటి సంస్థను ఎందుకు విశ్వసించాలంటూ మరికొంతమంది ట్విటర్ యూజర్లు ప్రశ్నించారు. అయితే టీకాలకు తాను వ్యతిరేకం కాదని, కానీ ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్న దోపిడీదారులను అనుమతించకూడదంటూ స్వామి సమాధానం ఇచ్చారు. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్)
మరోవైపు ఈ వ్యాక్సిన్‌ను బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. తాను వ్యాక్సిన్‌ను తీసుకోబోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవ్యాక్సిన్‌ను తానెలా విశ్వసిస్తున్నానంటూ వైద్యులను శాసస్త్రవేత్తలను అవమానిస్తున్నారన్న బీజేపీ విమర్శలనుఆయన తిప్పికొట్టడం విశేషం.
WHO hasn't cleared AstraZeneca even for emergency use!! Are Indians going to be Guinea pigs?
— Subramanian Swamy (@Swamy39) January 2, 2021