ఒక్కో ట్వీట్కు 200 రూపాయలు! | Subramanian Swamy fires on Stalin | Sakshi
Sakshi News home page

ఒక్కో ట్వీట్కు 200 రూపాయలు!

Published Wed, Feb 15 2017 4:03 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

ఒక్కో ట్వీట్కు 200 రూపాయలు!

ఒక్కో ట్వీట్కు 200 రూపాయలు!

చెన్నై :
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శశికళ కంటే ఎంకె స్టాలిన్‌, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరుడు కళానిధి మారన్లు ప్రమాదమైన వ్యక్తులని మండిపడ్డారు. మనం చేయాల్సింది మాత్రం ఇంకా మిగిలే ఉంది అని చెప్పారు. వీళ్లను ఓడించడం ప్రపంచ చరిత్రలోనే  ఫాసిస్టు, నియంతగా శాశ్వతంగా నిలిచి పోయిన అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీలపై గెలవడం లాంటిదని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. 
 
స్టాలిన్ అల్లుడు, మారన్ సోదరులు వందమంది నిరుద్యోగులను రిక్రూట్ చేసుకొని వారితో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేపిస్తున్నారని సుబ్రమణ్యంస్వామి ఆరోపించారు. వాటి నుంచి చేస్తున్న ఒక్కో తప్పుడు ట్వీట్కు రూ.200 ఇస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం తనని ఎంతో బాధించిందని సుబ్రమణ్యంస్వామి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement