![Goddess Lakshmi On Notes May Improve Condition Of Rupee - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/16/2.jpg.webp?itok=hql0zVVl)
న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు.
తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment