
సాక్షి, అమరావతి: టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌తో దర్యాప్తునకు అనుకూలంగా ప్రస్తుత పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో వణుకు మొదలయ్యాయని బీజేపీ జాతీయ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకే తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై బాబు అనుకూల మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్నది గుర్తించడం కష్టమని.. భక్తుడు తనకు తాను చెబితేగానీ తెలియదనే దాని గురించే టీటీడీ చైర్మన్ మాట్లాడారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment