న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి తను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2006లో జరిగిన ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బీ) అనుమతి ఇచ్చే విషయంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రూ.600 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చి.. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపేలా చేయడంలో చిదంబరం సూత్రధారి అంటూ స్వామి కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం చిదంబరం పాత్రపై ఆధారాలు రెండు వారాల్లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.