Justice JS khehar
-
కొత్త సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
సుప్రీంకోర్టులో కీలక తీర్పులనిచ్చిన న్యాయమూర్తి న్యూఢిల్లీ/భువనేశ్వర్: 45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా (63) నియమితులు కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయనే అత్యంత సీనియర్ జడ్జి. జస్టిస్ దీపక్ మిశ్రాను సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేసిన అనంతరం ఈ నెల 28న జస్టిస్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. 13 నెలలపాటు ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సిందిగా జస్టిస్ జేఎస్ ఖేహర్ గత నెలలో న్యాయమంత్రిత్వ శాఖకు సిఫారసు చేయడం తెలిసిందే. సీజేఐ పదవిని చేపట్టనున్న మూడో ఒడిశా వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా. గతంలో ఒడిశాకు చెందిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ గోపాల వల్లభ పట్నాయక్‌లు సీజేఐలుగా పనిచేశారు. సంచలన తీర్పులకు చిరునామా జస్టిస్ మిశ్రా! 1977లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన మిశ్రా అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించనున్నారు. 1996లో ఒడిశా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మిశ్రా... 2010లో ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అనంతరం 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండగా పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులను ఆయన వెలువరించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టు తలుపు తెరిచి విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను ఆయన సమర్థించారు. సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం వేయాలని తీర్పునిచ్చింది కూడా జస్టిస్ మిశ్రానే. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రాపై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, కావేరీ జలాల వివాదం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సంస్కరణలు, పనామా పేపర్ల లీకులు, సెబీ–సహారా చెల్లింపులు సహా పలు కీలక కేసులను విచారించే ధర్మాసనాలకు జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించాల్సి ఉంటుంది. -
గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం దుర్వినియో గం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం బుధవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. ‘ప్రైవసీ పరిరక్షణ అనే విఫల యుద్ధాన్ని చేస్తున్నాం. వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని బెంచ్ పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే , దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. ‘గోప్యత హక్కు’ కింద వద్దు: కనీస వ్యక్తిగత విషయాలు వెల్లడించడాన్ని గోప్యత హక్కు కింద పరిగణించరాదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. నేటి సాంకేతిక యుగంలో పారదర్శకత కీలకమని పేర్కొంది. గోప్యతకు చెందిన పలు అం శాలు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయంది. వ్యక్తిగత సమాచారం వాణిజ్య పరంగా దుర్వినియోగం కాకుండా టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏదైనా పిల్ దాఖలు చేసే సమయంలో లాయర్లు కూడా తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఐడీ కార్డు తదితర వివరాలు ఇవ్వాలన్న సుప్రీం నిబంధనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అత్యున్నత న్యాయస్థానాలు సాంకేతికతతో ముందుకు సాగుతూ నిబంధనల పేరిట వ్యక్తిగత సమచారాన్ని కోరుతున్నాయని అన్నారు. గోప్యత హక్కును ఇతర ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చితే అభ్యంతరమేమీ లేదని, దాన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. హరియాణా ప్రభుత్వ లాయర్లు కూడా గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించరాదని కోర్టుకు విన్నవించారు. -
‘గోప్యత’ ప్రాథమిక హక్కే!
► కానీ పరిమితులు ఉండాలి ► సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపిం ది. దీన్ని పేద ప్రజలను కనీస అవసరాలకు దూరం చేసేందుకు వాడుకోకూడదని స్పష్టం చేసింది. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొంది. ‘స్వేచ్ఛతో ముడిపడిన గోప్యత.. గుణాత్మకమైన ప్రాథమిక హక్కు కావొచ్చు. అయితే అది నిరపేక్షం కాదు. గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదు’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీ.. ప్రాథమిక హక్కా, కాదా? ప్రభుత్వం దాన్ని ప్రాథమిక హక్కుగా భావిస్తే ఈ కేసును మూసేస్తామని ధర్మాసనం చెప్పడంతో అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో గోప్యత హక్కు ఏకరూప హక్కు కాదని.. కూడు, గూడు లేని 70 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులను పిడికెడు మంది గోప్యత పేరుతో విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ..ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా కోర్టు.. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రస్తావించింది. ‘అవి ఈ దేశ పేద ప్రజలపై చేసిన ఘోరమైన ప్రయోగం’ అని అభివర్ణించింది. ప్రభుత్వం ఒక మహిళను నీకెంతమంది పిల్లలు అని అడొగచ్చని, అయితే ఎన్నిసార్లు గర్భస్రావాలయ్యాయి అని అడగకూడదని పేర్కొంది. -
గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?
-
గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?
నేడు విచారించనున్న 9 మంది సభ్యుల ధర్మాసనం న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్ప ట్లో తీర్పునిచ్చింది. 9 మంది సభ్యుల ధర్మాసనం బుధవారం నుంచే విచారణ ప్రారంభించి..రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోం దంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టు పై ఆదేశాలిచ్చింది. 2015లో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ పిటిషన్లపై వాదిస్తూ...గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న దానిపై సుప్రీంకోర్టు గత తీర్పుల్లోనే భిన్న నిర్ణయాలు వెలువడ్డాయన్నారు. ముందుగా దీనిపై తేల్చి, అనంతరం ఆధార్‌పై విచారించాలని కోర్టును కోరారు. అనంతరం ఈ పిటిషన్లను కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. వీటిని మంగళవారం విచారించిన న్యాయస్థానం..9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. -
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ చట్టబద్ధమేనని కొన్ని ఇస్లాం మత శాఖలు చెబుతున్నప్పటికీ అతి చెత్త విధానమని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం రెండో రోజు విచారణలో పేర్కొంది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ తలాక్ విధానంపై నిషేధం ఉన్న ఇస్లామిక్, ఇస్లామిక్యేతర దేశాల జాబితాను రూపొందించాలని ఆయనను కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్‌కు అనుమతి లేదని ఖుర్షీద్ తెలిపారు. తలాక్ బాధితుల తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తూ.. ఈ విధానం సమానత్వ హక్కుతోపాటు పలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. ‘ట్రిపుల్ తలాక్ చెప్పే అవకాశం భర్తకే ఉంది కానీ భార్యకు లేదు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించడమే. కాగా, ట్రిపుల్ తలాక్ మహిళల హక్కుల అంశమైనప్పటికీ.. సుప్రీం బెంచ్‌లో మహిళా జడ్జి లేకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం ప్రశ్నించారు. -
ట్రిపుల్ తలాఖ్ అంటే... ఉరిశిక్ష లాంటిదే: సీజే
ముస్లిం పురుషులు తమ భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ తలాఖ్ పద్ధతి ఉరిశిక్ష లాంటిదేనని, అది ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాకపోయినా ఇప్పటికీ దాన్ని అమలుచేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇది పాపమే గానీ చట్టబద్ధమని చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు. ఒకే సమయంలో మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని మరీ పనిచేస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి వివక్షాపూరితమని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేందిగా ఉందని వాదిస్తూ పలువురు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మతం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిన విషయాన్ని చట్టం ఆమోదించగలదా అని సల్మాన్ ఖుర్షీద్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి మహిళల పట్ల వివక్ష చూపిస్తుందని, విడాకులు ఇచ్చేందుకు అందులో మహిళలకు సమానహక్కులు లేవని ముగ్గురు ముస్లిం మహిళల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు. ఫోరమ్ ఫర్ అవేర్నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ తరఫున కూడా జెఠ్మలానీ తన వాదనలు వినిపించారు. ఒకే మతంలో ఉన్న పురుషులు, మహిళలకు పెళ్లి విషయంలో ఒకే తరహా నిబంధనలు ఉండాలని ఆయన అన్నారు. ఈనెల 19వ తేదీ నాటికల్లా ఈ కేసులో వాదనలు ముగించి, జూన్ నెలలో తీర్పు వెల్లడించాలని ధర్మాసనం భావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఒక హిందూ, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక జొరాస్ట్రియన్ న్యాయమూర్తులు ఉన్నారు. ఇదే సందర్భంలో ముస్లిం మతంలో ఉన్న బహుభార్యత్వం, నిఖా హలాలా లాంటి ఆచారాలను కూడా తాము పరిశీలిస్తామని ధర్మాసనం చెప్పింది. ఈ మూడు ఆచారాలను కొట్టిపారేయాలని కొందరు పిటిషనర్లు కోర్టును కోరారు. భారతదేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ లాంటి అంశాల్లో ఒక్కో మతానికి ఒక్కో పర్సనల్ లా ఉంది. -
అయోధ్య వివాదంపై సుప్రీం కీలక సూచన
-
బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద బాబ్రీ మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది. బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమని పేర్కొంది. నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు బయట పరిష్కారమే శ్రేయస్కరమని తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తెలిపారు. బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని స్వామికి న్యాయస్థానం సూచించింది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. చర్చల ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి సిద్ధమని తెలిపింది. -
జస్టిస్ కర్ణన్‌పై అరెస్ట్ వారెంట్
కోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన సుప్రీంకోర్టు ► రాజ్యాంగ విరుద్ధమన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ► సీజేఐపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు న్యూఢిల్లీ/కోల్‌కతా: కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ నెల 31 ఉదయం కర్ణన్ ను కోర్టు ముందు హాజరు పరచాలని పశ్చిమబెంగాల్ డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఆదేశించింది. రూ.10 వేల పూచీకత్తుపై కర్ణన్ బెయిలు పొందవచ్చని సూచించింది. సర్వీసులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి అరెస్టు వారెంటు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ‘కోర్టు ఆదేశించినా కర్ణన్ వ్యక్తిగతంగాగానీ, తన లాయర్ ద్వారాగానీ హాజరు కాలేదు. వారంట్‌కు తప్ప వేరే మార్గంలేదు’ అని సీజేఐ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోస్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆదేశాలు బేఖాతరు... మద్రాస్ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, విశ్రాంత జడ్జీలు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని, సీజేఐలకు కర్ణన్ లేఖలు రాశారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఫిబ్రవరి 8న కోర్టు ముందు హాజరై, వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం నోటీసు లిచ్చింది. ఆయన హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 13న హాజరు కావాలంటూ మరో నోటీసిచ్చింది. ఈ ఆదేశాలనూ జస్టిస్ కర్ణన్ బేఖాతరు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జిపై చర్యలు తీసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, ఈ విషయాన్ని ముందుగా పార్లమెంటుకు రిఫర్ చేయాలని పేర్కొంటూ ఫిబ్రవరి 10న సీజేఐకు జస్టిస్ కర్ణన్ లేఖ రాశారు. సుప్రీం అధికార దుర్వినియోగంపై విచారణ జరపండి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 ప్రకారం.. జస్టిస్ ఖేహర్‌తో పాటు ధర్మాసనంలోని మరో ఆరుగురు జడ్జీలపై కేసు నమోదు చేసి, విచారణ జరపాల్సిందిగా.. జస్టిస్ కర్ణన్ సీబీఐని ఆదేశిస్తూ శుక్రవారం మీడియా ముందే సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. దర్యాప్తు నివేదికను సంబంధిత సీబీఐ కోర్టు ముందుంచాలన్నారు. సర్వోన్నత న్యాయస్థానం అధికార దుర్వినియోగంపై విచారణ జరపాలని సూచించారు. అలాగే దీనికి సంబంధించి సరైన విచారణ జరిగేలా పూర్తి సాక్ష్యాధారాలను స్పీకర్ ముందుంచాలని ఈ కేసుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు సూచించినట్టు తెలిపారు. దీంతోపాటు తనపై అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతున్నానని, తనకెలాంటి పోర్టుఫోలియో ఇవ్వకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ‘జస్టిస్ కర్ణన్ తీరు బాధాకరం’ కర్ణన్ కోర్టులో వ్యవహరించిన తీరుపై ‘న్యాయ’లోకం ఆవేదన వ్యక్తం చేసింది. జడ్జిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సరికాదంటూ కర్ణన్ వాదించటం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉందని అభిప్రాయపడింది. మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ కర్ణన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ఒక జడ్జి ఇలాంటి వ్యాఖ్య లు చేయటం బాధాకరమన్నారు. దళితుడిని కావడం వల్లనే..: జస్టిస్ కర్ణన్ కోల్‌కతా: సుప్రీంకోర్టు ఇచ్చిన అరెస్ట్వారంట్పై జస్టిస్ కర్ణన్ స్పందించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తనకు అరెస్ట్వారంట్ ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి లేదన్నారు. దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని శుక్రవారం కోల్‌కతాలో ఆరోపించారు. మద్రాస్ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని ప్రధానికి లేఖ రాయడం వల్లనే తనపై ఈ కక్ష సాధింపన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కోర్టు ధిక్కరణ చట్టం 2(సీ), 12, 14 సెక్షన్ల కింద హైకోర్టు సిట్టింగ్ జడ్జికి అరెస్ట్ వారంట్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. దళితుడిని కావడం వల్లనే నాపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు’ అని జస్టిస్ కర్ణన్ పేర్కొన్నారు. సిట్టింగ్ హైకోర్టు జడ్జీలపై చర్యలు తీసుకోవాలంటే.. న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం సమగ్ర దర్యాప్తు తరువాత పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టడమొక్కటే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు. -
చనిపోయాక పరిహారమా?
నివారణకు చర్యలు తీసుకోండి ♦ రైతు ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్ ♦ దశాబ్దాలుగా పరిష్కారం చూపకపోవటం దారుణమని వ్యాఖ్య న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నియంత్రణలో ప్రభుత్వం సరైన దిశలో వెళ్లటం లేదని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిహారం అందించటమే సమస్యకు పరిష్కారం కాదని.. ఆత్మహత్యలు జరగకుండా పథకాలు తీసుకురావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అప్పులు, పంట నష్టాలతో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నియంత్రించేందుకు సరైన రోడ్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాలని కోరింది.‘ఇది చాలా ముఖ్యమైన సమస్య. ప్రస్తుతం మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సమస్యపై మీరు చేస్తున్న పని సరైన దిశలో లేదని అర్థమవుతోంది.రైతులు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని.. కట్టలేని పరిస్థితి వచ్చినపుడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణత్యాగం చేశాక పరిహారం ఇవ్వటం కాదు. ఆత్మహత్యలను నియంత్రించేలా సరైన పథకాలు తీసుకురావాలి’ అని ధర్మాసనం సూచించింది. దశాబ్దాలుగా ఆందోళన కలిగిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఇంతవరకు చూపకపోవటం దారుణమని మండిపడింది. ఒకవేళ మొదట్నుంచీ సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పటికే ఈ దిశలో చాలా సాధించేవారమని అభిప్రాయపడింది.‘సిటిజన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్ ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ గుజరాత్లో రైతుల దుస్థితి, ఆత్మహత్యలపై వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పరిధిని యావద్దేశానికి విస్తృతం చేసింది. జాతీయ రైతుల పాలసీ– 2007లో లోపాలు కూడా రైతు ఆత్మహత్యలను నిరోధించటంలో ప్రభుత్వ వైఫల్యానికి కారణమై ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. భరోసాకు మరిన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పలు పథకాలను తీసుకొచ్చిందని.. పంటల బీమా పథకం–2015 ద్వారా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ కోర్టుకు వెల్లడించారు. ఒత్తిడిలో ఉన్న అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉం దని భరోసా కల్పించేలా మరిన్ని పథకాల ను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీవో తరపు న్యాయవాది కోలిన్ గంజాల్వేజ్ వాదిస్తూ.. ‘రైతుల ఆత్మహత్యలపై చాలాకాలంగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో వీటి అమల్లోనే అసలు సమస్య వస్తోంది. రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ , ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ జరిపిన అధ్యయన ఫలితాలను కూడా కోర్టు పరిశీలించాలి’ అని కోరారు. పంటనష్టంతో బాధపడుతున్న రైతులకు హెక్టారుకు రూ.30వేల ఆర్థికసాయం ఇవ్వాలని గంజాల్వేజ్ డిమాండ్ చేశారు. -
విదేశీ చెత్తకు అనుమతి ఎలా?
ప్రజారోగ్యం పణంగా పెట్టి ధనార్జనా: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ: విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పారవేసేందుకు అనుమతించి, అందుకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ పౌరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం డబ్బు సంపాదిస్తోందని కోర్టు విమర్శించింది. విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పడేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారనీ, దీనివల్ల దేశ పౌరులపై దుష్ప్రభావాలు పడుతున్నాయని ‘రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ ’అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు అనేకసార్లు ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయడం లేదనీ, కలుషిత పదార్థాలను భారత్‌లో పారవేసేందుకు అనుమతిస్తుండటంతో పౌరుల ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశమనీ, అధికారులు నిబంధనలను అతిక్రమించకూడదని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. సమగ్ర వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 31కి వాయిదా వేసింది. గతంలో అలస్కా ఆయిల్ లీకేజీ(1989)తో సంబంధం ఉన్న ఓడను గుజరాత్ తీరంలో నాశనం చేయడానికి ప్రయత్నించగా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. -
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
-
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
అప్పగించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. దీని కోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని, ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని, అందువల్ల విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. కాగా, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1), ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. -
తలాక్’లో న్యాయ అంశాలనే పరిశీలిస్తాం
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో న్యాయ సంబంధమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముస్లిం చట్టాల ప్రకారం విడాకులు పొందితే దానిపై కోర్టులు పర్యవేక్షణ ఉండాలనే దానిని తాము పరిశీలించబోమని, అది శాసన సంబంధమైనదని మంగళవారం తెలిపింది. పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదులు భేటీ అయి తాము పరిశీలించాల్సిన అంశాలను ఖరారు చేయాలని, ఆ అంశాలను నిర్ణయించడానికి గురువారం విచారణ జాబితాలో చేర్చుతున్నామని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే ట్రిపుల్ తలాక్ బాధి తులకు సంబంధించిన సంక్షిప్త ఉదాహ రణలు సమర్పించడానికి కోర్టు అనుమతిం చింది. ముస్లిం సంప్రదాయాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. రాజ్యాం గంలోని లింగసమానత్వం హక్కుపై తొలుత చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను వ్యతిరేకిస్తూ కేంద్రం వాటిని పరిశీలించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టుకు హాజరుకాని జస్టిస్ కర్ణన్
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఆయన మాత్రం సోమవారం నాటి విచారణకు హాజరుకాలేదు. జస్టిస్ కర్ణన్ పై సుమోటోగా ధిక్కార కేసు స్వీకరించి విచారణ ఎందుకు చేపట్టకూడదో ఆయన వ్యక్తిగతంగా తెలపాలని ఫిబ్రవరి 8న సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలను విమర్శిస్తూ జస్టిస్ కర్ణన్ రాసిన వరుస లేఖలపై సుప్రీం కోర్టు సీరియస్ అయి ధిక్కార కేసు నమోదు చేయడానికి సిద్ధపడింది. ఆయనకు జ్యుడీషియల్, కార్యనిర్వాహక విధులు అప్పగించవద్దని హైకోర్టును ఆదేశించింది. అయితే ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనం.. జస్టిస్ కర్ణన్ విచారణకు హాజరుకానందున ఆయనపై ధిక్కార అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టా లన్న అటార్నీ జనరల్ రోహత్గీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయన సమాధానం కోసం మూడు వారాల గడువిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. -
‘ఎయిర్‌సెల్–మ్యాక్సిస్’ ఆధారాలివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి తను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2006లో జరిగిన ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బీ) అనుమతి ఇచ్చే విషయంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రూ.600 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చి.. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపేలా చేయడంలో చిదంబరం సూత్రధారి అంటూ స్వామి కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం చిదంబరం పాత్రపై ఆధారాలు రెండు వారాల్లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. -
మొబైల్ యూజర్ల గుర్తింపును తనిఖీ చేయండి
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులు టెలికాం కంపెనీలకు ఇచ్చిన గుర్తింపు వివరాలను ఏడాదిలోపు తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంది. కొత్తగా సిమ్‌లు మంజూరు చేయడానికి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానాన్నే ఉపయోగించాలని సోమవారం చెప్పింది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ తీర్పు చెప్పింది. వినియోగదారులు రీచార్జ్ చేసుకునే సమయంలో వారి వివరాలను మళ్లీ తీసుకోవచ్చని కోర్టు సూచించగా, రీచార్జ్ ఔట్లెట్లు అపరిమిత సంఖ్యలో ఉన్నందున ఇది సాధ్యం కాకపోవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు. -
బడ్జెట్ వాయిదాకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్నందున, అవి పూర్తయ్యే వరకు కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఐదు రాష్ట్రాల ఓటర్లను బడ్జెట్ ప్రభావితం చేస్తుందనేదానికి సంబంధించి ఏ నిర్దిష్ట కారణం లేదంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టాలనుకున్న 2017–18 బడ్జెట్‌ను.. ఏప్రిల్ 1న ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఎమ్.ఎల్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ ఎన్నికలయ్యేంత వరకు కేంద్రం ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించకుండా చూడాలని పిల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకిస్తూ.. నిరంతరం జరిగే రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర బడ్జెట్ సమర్పణ ఆధారపడి ఉండబోదన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేలా కేంద్రం వరాలు ప్రకటించే అవకాశం ఉందన్న వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదన అర్థరహితమంది. పిటిషనర్ వాదన చూస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకూడద న్నట్లుందని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతంలో కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేశారన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. -
కళంకిత నేతలు పోటీచేయొచ్చా?
వారి భవితవ్యం తేల్చేందుకు త్వరలో ఐదుగురు జడ్జీల బెంచ్ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో.. సుప్రీం కోర్టు కీలకనిర్ణయం తీసుకోనుంది. కళంకిత నేతల భవిష్యత్ నిర్ణయించడానికి త్వర లో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతున్నామని గురువారం సుప్రీం కోర్టు తెలిపింది. తీవ్రమైన నేరారోపణలతో విచారణ ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు, విచారణ ఏ దశలో ఉండగా ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే అంశాలపై ఈ ధర్మాసనం తీర్పునివ్వనుంది. ‘ఈ అంశాలపై స్పష్టతనిస్తే.. వచ్చే ఎన్నికల్లోగా చట్టం గురించి ప్రజలు తెలుసుకుంటారు’ అని ఒక పిల్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. కొంతమంది నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో క్రిమినల్స్ పోటీపై అత్యవసరంగా తేల్చాల్సి ఉందంటూ బీజేపీ ప్రతినిధి అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఖేహార్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. తప్పుడు కేసులు దాఖలయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయా లని, విచారణను రోజువారీ విధానంలో కొనసాగించాలని కింది కోర్టులను ఆదేశించింది. విచారణ జాప్యంతో తీవ్ర నేరారోపణ ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు పదవుల్లోనే కొనసాగుతు న్నారని ధర్మాసనం వాఖ్యానించింది.