సెక్షన్‌ 377పై తీర్పు : ‘హెచ్‌ఐవీ కేసులు పెరుగుతాయి’ | Subramanian Swamy Over Supreme Court Verdict On Section 377 | Sakshi
Sakshi News home page

సెక్షన్‌ 377పై సుప్రీం తీర్పు : ‘హెచ్‌ఐవీ కేసులు పెరుగుతాయి’

Published Thu, Sep 6 2018 1:45 PM | Last Updated on Thu, Sep 6 2018 6:01 PM

Subramanian Swamy Over Supreme Court Verdict On Section 377 - Sakshi

న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్‌ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని తెలిపారు.

సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్‌ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా  పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు.

స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి  సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement