
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు అభ్యతరం లేదనీ, అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్, యూపిలోని యోగి సర్కార్ ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని అన్నారు. ఏదేని కారణాలతో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని హెచ్చరించారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే జనవరి తర్వాత అయోధ్య కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment