శేషాచల కొండల్లో ఫ్లయింగ్ స్నేక్
తిరుపతి : భారతదేశంలో ఎక్కడా కనిపించని శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ శేషాచలం అడవుల్లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని తిరుపతి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు చెట్ల పైభాగాన సంచరించే ఈ స్నేక్ బూడిద రంగులో ఉంటుంది. శరీరంపై నల్లటి చారలుంటాయి.
విషపూరితమైన ఈ పామును చామల రేంజ్ అటవీప్రాంతంలో శివరామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో తమిళనాడు పరిశోధకుడు బుభేష్‌గుప్తా ఏడాది క్రితం గుర్తించారు. బెంగుళూరులోని ఇండియన్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు డీఎన్‌ఏని పంపి 2 రోజుల క్రితం నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం దీన్ని తిరుపతిలోని బయో రీసెర్చి సెంటర్లో ఉంచారు. వైఎస్‌ఆర్ జిల్లా బాలపల్లి రేంజ్‌లోని కోడూరు ప్రాంతంలో ఈ పాము కనబడిందని.. ఇక్కడ స్లెండర్ కోరల్ స్నేక్, షీల్‌టైల్ స్నేక్, బూబ్రౌన్ వైన్ స్నేక్, ఎల్లో కాలీడ్ ఉల్ఫ్ స్నేక్, రేసర్ లనూ గుర్తించారని తెలిపారు.