ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వివరాల్లోకి వెళ్లితే...పత్తికోళ్లలంక గ్రామంలో గురువారం ఉదయం ఫారెస్ట్ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లేరు పరిధిలోని వివాదాస్పద చెరువుల్లో చేపలు పట్టుకుంటున్న గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై గ్రామస్తులు దాడికి దిగడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతమనేని ప్రభాకర్ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కేసు కోర్టుపరిధిలో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని ఫారెస్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన చింతమనేని.. కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
కొల్లేరు పరిధిలో ఉద్రిక్తత..
Published Thu, May 5 2016 10:44 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement