fish catching
-
చేపలు ఎలా పడతారంటే.?
-
అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి
నల్లబెల్లి: చెరువులో అనుమతి లేకుండా చేపలు పట్టిన పాపానికి గిరిజనులను బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుష ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన చిరుకూరి సుమన్, నల్లబెల్లి మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఇసాల జగన్, కన్నారావుపేట ఉప సర్పంచ్ తురుస అశోక్, గట్టి చెన్నయ్యలు పద్మపురం సమీపంలోని అర్షనపల్లి చెరువులో చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లారు. చేపలు పడుతుండగా విషయం తెలుసుకున్న ఆ చెరువు కాంట్రాక్టర్లు సిద్ద గణేశ్, సురేశ్‌లతోపాటు మరికొందరు వెళ్లి ఆ నలుగురినీ వెంబడించారు. చిరుకూరి సుమన్ పట్టుబడగా.. మిగతా ముగ్గురూ పారిపోయారు. సుమన్ కాళ్లు, చేతులను వెనుకవైపు ఒంచి కట్టేసి బోల్లోనిపల్లికి తరలించారు. గ్రామంలో చెట్టుకు వలలతో కట్టేసి దాడి చేశారు. పారిపోయిన ఇసాల జగన్ బోల్లోనిపల్లి గ్రామానికి చేరుకుని కాంట్రాక్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నించగా అతన్ని సైతం దూషిస్తూ బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. పంచాయితీ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన నలుగురు వ్యక్తులూ రూ.25వేల జరిమానా చెల్లించాలని తీర్మానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పద్మాపురం గ్రామానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
చేపల పట్టుబడి.. మెలకువలతో అధిక రాబడి
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే.. పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం ∙రైతులు మార్కెట్లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి ∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి ∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి ∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి. ∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి ∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి పట్టుబడి సమయంలో.. ∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి ∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి ∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి ∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు ∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు ∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి ∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి పట్టుబడి తర్వాత.. ∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి ∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి ∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి ∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి ∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి ∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు ∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి ∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి గ్రేడింగ్ ఇలా.. ∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం ∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి ∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి ∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి ∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! -
బంగారు చేప: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు
Ghol Fish Price In Mumbai: నీలి విప్లవంతో మత్య్సకారుల బతుకులు కొంత బాగుపడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి.. పైగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తులు భారీ ధరకు ఆ చేపలను కొనుగోలు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం) మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన చంద్రకాంత్ థారె మత్స్యకారుడు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని రోజులుగా నిలిపివేసిన చేపల వేటను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో చంద్రకాంత్ ఆగస్టు 28వ తేదీన సముద్ర తీర ప్రాంతం వద్వాన్‌కు హర్బా దేవీ బోటులో తన బృందంతో కలిసి వెళ్లాడు. చేపల వేట సాగించగా పెద్ద ఎత్తున చేపలు పడ్డాయి. వాటిలో సముద్రపు బంగారంగా పిలిచే అత్యంత అరుదుగా లభించే చేపలు ‘గోల్ ఫిష్’ భారీగా పడ్డాయి. 157 చేపలు పడడంతో వాటిని తీసుకుని వచ్చాడు. మార్కెట్‌కు తీసుకెళ్లగా ఆ చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్కో చేప విలువ రూ.85 వేల దాక పలికింది. అంతగా ఆ చేపను కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఆ చేపల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.గోల్ ఫిష్ చేప శాస్త్రీయ నామం ‘ప్రొటనిబి డయాకాంతస్’. ఈ చేపకు హంకాంగ్, మలేసియా, థాయిలాండ్, ఇండోనేసియా, సింగపూర్, జపాన్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా అరుదుగా లభించే ఈ చేపను వైద్య పరిశోధనలకు వినియోగిస్తారు. పైగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆ చేపలు అంతగా లభించడం లేదు. -
డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ‘డబ్బులు ఇవ్వండి.. పట్టుకోండి’.. అంటే దేని గురించి అని అనుకుంటున్నారా..? ఇందులోనే అసలు కథ ఉంది. దీనిలోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామ శివారులో గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్య సంపద ఉంది. నిత్యం గుడిపేట పరిధిలోని మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రతీ ఏడాది జూలై 1 నుంచి మొదలు ఆగస్టు 31 వరకు అంటే సరిగ్గా రెండు నెలల పాటు చేపలు పట్టరాదని మత్స్యశాఖ నిబంధనల మేరకు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో చేపల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందనే కారణంతో చేపలు పట్టేందుకు నిషేదాజ్ఞలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మత్స్యకారులు చేపలు పట్టకుండా సంయమనంతో ఉన్నా ఇటీవల కొత్తగా వ్యవహరిస్తున్నారు. వివరాలు ఏంటని ఆరా తీస్తే అసలు భాగోతం బయటపడింది. గుడిపేట–నంనూర్ మత్స్యకారుల సంఘంలోని సభ్యులంతా ఒక తీ ర్మానం చేసుకున్నారు. దాదాపు వంద మంది స భ్యులు ఒక్కొక్కరూ రూ. 300ల వరకు వేసుకుని దాదాపు రూ. 30 వేలు జమ చేశారు. మత్స్యశాఖ ద్వారా చేపలు పట్టుకోకుండా నోటీసులు అందుకున్న సభ్యులంతా మత్స్యశాఖ అధికారులకు ఈ 30 వేలు ముట్టజెప్పి చేపలు పట్టుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు ప్రాజెక్ట్ వైపు దృష్టి పెట్టకపోవడంతో వీరు దర్జాగా చేపలు అమ్మకుంటున్నారు. -
‘కరెంట్’తో చేపల వేట.. షాక్‌తో మృతి
పటాన్చెరు టౌన్ : విద్యుత్ తీగలను నీటి గుంతలో వేసి చేపలు పట్టేందుకు యత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్టారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని పోచారం పరిధిలోని గణపతి గూడెంకు చెందిన ప్రవీణ్ కుమార్(22) ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం ప్రవీణ్ కుమార్ అతని స్నేహితులు ఠాగుర్శివ, ఎర్దనూర్ ప్రశాంత్ పోచారం సమీపంలో ఉన్న ఈర్లమల్లన్న గుడి సమీపంలోని గుంతలో చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. అనంతరం సమీపంలోని కరెంటు తీగలకు వైరు వేసి ఇంకో చివరను గుంతలో వేసి చాపలు పట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్నేహితులు ఠాగుర్ శివ, ప్రశాంత్ ప్రవీణ్ కుమార్‌ను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందిన్నట్లు డాక్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొల్లేరు పరిధిలో ఉద్రిక్తత..
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే...పత్తికోళ్లలంక గ్రామంలో గురువారం ఉదయం ఫారెస్ట్ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లేరు పరిధిలోని వివాదాస్పద చెరువుల్లో చేపలు పట్టుకుంటున్న గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై గ్రామస్తులు దాడికి దిగడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతమనేని ప్రభాకర్ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కేసు కోర్టుపరిధిలో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని ఫారెస్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన చింతమనేని.. కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.